డాంగ్ డాంగ్ సాంగ్‌కు డాన్స్ అద‌ర‌గొట్టిన‌ మ‌హేష్ బాబు కూతురు.. వైర‌ల్ వీడియో..!

309

సూపర్ స్టార్ మహేశ్ బాబు గారలపట్టి సితార గురించి అందరికీ తెలిసిందే. ఈ మల్టీ ట్యాలెంటెడ్ పాప‌ అటు యూట్యూబ్‌లో వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు నాట్యం నేర్చుకుంటుంది. క్లాసికల్‌ డ్యాన్స్‌తో పాటు తన తండ్రి సినిమా పాటలకు ఔరా అనిపించేలా స్టెప్పులు వేస్తుంటుంది. ఇక తండ్రితో కలిసి చలాకీగా తిరుగుతుండే ఈ చిన్నారికి సంబంధించిన ముఖ్య అప్‌డేట్స్‌ను ప్రిన్స్, నమత్ర ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటుంటారు. ఆ మధ్య బాహుబలి సాంగ్‌కు డాన్స్ వేసి అదరగొట్టిన సితార తాజాగా తన తండ్రి తాజా సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని తమన్నా తన డ్యాన్స్‌తో అదరగొట్టిన డాంగ్ డాంగ్ సాంగ్‌కు డాన్స్ అదిర‌గొట్టింది.

ఆ పాటలో తమన్నా ధరించిన కాస్ట్యూమ్ స్టైల్‌లోనే సితార కూడా డాంగ్ డాంగ్ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసింది. డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌కు సితార చేసిన డ్యాన్స్‌ను నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అయింది. అంతేకాకుండా సితార ప్రతిభను నెటిజన్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను మహేశ్‌ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

View this post on Instagram

 

absolutely nailed it💃💃👏👏 #SarileruNeekevvaru

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on