మీడియాకి మహేష్ క్లాస్.. ఇది కూడా సెంటిమెంటేనా..!

-

సూపర్ స్టార్ మహేష్ తన సినిమాల విషయంలో చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతుంటాడు. ముఖ్యంగా మే నెలలో మహేష్ సినిమా వస్తే అది ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా అది ఫ్లాప్ అయినట్టే. లేటెస్ట్ గా మహేష్ చేస్తున్న మహర్షి సినిమాకు ఈ సెంటిమెంట్ పాళ్లు ఎక్కువయ్యాయని తెలుస్తుంది. సినిమాను మహేష్ కు కలిసి వచ్చే ఏప్రిల్ లోనే రిలీజ్ ఫిక్స్ చేయగా మహర్షి కోసం మహేష్ మరో సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడట.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న మహర్షి సినిమాలో కూడా మీడియా సన్నివేశం ఉంటుందట. మీడియాకు మహేష్ క్లాస్ సూపర్ హిట్ సెంటిమెంట్ అని తెలిసిందే. బిజినెస్ మెన్, భరత్ అనే నేనులతో అది ప్రూవ్ అయ్యింది. అయితే అంతకుముందు సైనికుడు ఫ్లాప్ అయినా మహేష్ మరోసారి మహర్షి లో మీడియాకు క్లాస్ పీకుతాడట. ఈ సెంటిమెంట్ పరంగా చూస్తే మహర్షి కూడా హిట్ పక్కా అనేస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news