మహేష్ ‘చార్లి’ ప్రయోగం..!

-

సూపర్ స్టార్ మహేష్ హీరోగానే కాదు నిర్మాతగా మారబోతున్నాడు అంటూ కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఎం.బి ప్రొడక్షన్స్ లో మహేష్ ఓ టీం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ టీం ద్వారా సినిమాలు చేయాలని వారి ప్లాన్. అయితే సినిమాల కన్నా వెబ్ సీరీస్ లకు ఇప్పుడు ఎక్కువ క్రేజ్ రావడంతో ముందు వెబ్ సీరీస్ మీద దృష్టి పెట్టాడట మహేష్ బాబు. త్వరలోనే మహేష్ నిర్మాణంలో తొలి వెబ్ సీరీస్ రాబోతుందట.

ఆ వెబ్ సీరీస్ ను హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్న హుస్సెన్ షా కిరణ్ మీకు మీరే మాకి మేమే సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు అతని డైరక్షన్ లోనే మహేష్ వెబ్ సీరీస్ ఉంటుందట. ఇక ఆ వెబ్ సీరీస్ కు టైటిల్ గా చార్లి అని పెట్టారట. మహేష్ గెస్ట్ గా ఈ వెబ్ సీరీస్ మొదలు పెడతారని తెలుస్తుంది. ప్రొడక్షన్ కు సంబందించిన విషయాలు అన్ని నమ్రత దగ్గర ఉండి చూసుకుంటారని సమాచారం.

మొత్తానికి నిర్మాతగా మహేష్ తొలి అడుగు పడుతున్నట్టే. 8 ఎపిసోడ్స్ గా ఈ చార్లి సీజన్ 1 ఉంటుందట. త్వరలోనే ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెళ్లడిస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news