పేపర్‌ జాకీ..! ఆంధ్రజ్యోతివి అన్నీ కాశరామన్న ఉత్తరాలే..

-

ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాకరించిన అభ్యర్థులు, వారికి హైదరాబాద్‌తో ఉన్న సంబంధం ఎవరైనా కొంచెం పరిశోధిస్తే రాధాకృష్ణ, చంద్రబాబుల రంకుపురాణం బయటపడుతది. పూతలపట్టు టీడీపీ అభ్యర్థికి హైదరాబాద్‌లో ఏం ఆస్తులున్నాయని పోటీనుంచి తప్పుకొన్నారు? ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ టికెట్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టు బిల్లులన్నీ మంజూరుచేయించుకుని మరీ పార్టీ మారారు. బద్వేలు రాజశేఖర్ ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారు? నర్సాపురం రఘురామకృష్ణంరాజు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఎందుకు మారారు?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్ కో ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే కళలో బాగా పండిపోయారు. ముందుగా చంద్రబాబునాయుడు ఒక ఆరోపణ చేస్తారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరిస్తున్నారన్నది చంద్రబాబు చేసిన ఆరోపణ. దానిని సమర్థిస్తూ రాధాకృష్ణ ఒక వార్త వండివార్చుతారు. ఎవరు ఎవరిని బెదిరించారు? ఏ సందర్భంగా బెదిరించారు? వంటి వివరాలేమీ ఉండవు. ఆంధ్రజ్యోతి రాతలన్నీ ఆకాశరామన్న ఉత్తరంలా ఉంటాయి. తర్వాత చంద్రబాబు.. కీలుబొమ్మలు, తోలుబొమ్మలు అందరితో మాట్లాడిస్తారు. అందు లో జనసేన అధిపతి పవన్‌కల్యాణ్ కూడా ఉంటారు. పవన్‌కల్యాణ్‌కు ఆయన మాటల్లోనే చెప్పాలంటే కొంచెం తిక్క ఎక్కువ కదా! ఉచితానుచితాలు, సమయాసమయాలు, ఉచ్ఛనీచాలు మరిచి, పనిమాలా పెంచిన జూలును ఊపి ఊపి మాట్లాడుతుంటాడు. చూశారా పవన్‌కల్యాణ్ కూడా చెప్తున్నారు.. అని రాధాకృష్ణ మరో చెత్తపలుకు రాస్తాడు. మనసావాచా కర్మణా ఆంధ్రకు, చంద్రబాబుకు మేలు జరుగాలని కోరుకుంటూ, హైదరాబాద్‌కు, తెలంగాణకు ఎలా నష్టం జరుగుతుందో వగలుబోతూ రాస్తాడు.

గత రెండు దశాబ్దాలుగా చంద్రబాబు, రాధాకృష్ణ, మరికొందరు మీడియాధిపతులు సమిష్టిగా పండిస్తున్న రాజకీయ పత్రికా వ్యభిచార కళ ఇది. వీళ్లకు తమ కలిమి ఇంద్రభోగం, తమ లేమి లోక దారిద్య్రం. తాము మునిగింది గంగ. తాము మెచ్చింది రంభ. అది రోత అంటే, ఆహా అది పూత అని చెప్పగల జాణతనం ఈ ముఠాది. ఈ ఆర్టులో వీళ్లను మించినవాళ్లు లేరు. హైదరాబాద్‌లో ఎవరో భూమి అమ్మారట. అది రిజిస్ట్రేషన్ జరుగకుండా చూశారట. ఇదొక్కటే రాధాకృష్ణ ప్రస్తావించిన అంశం. హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంత నాయకులు కొందరు చేసిన అక్రమ రాజకీయ భూదందాలు అందరికీ తెలుసు. ఎన్ కన్వెన్షన్‌పై కేసుపెడితే రాధాకృష్ణకు నొప్పి కలిగిందట. అయ్యప్పసొసైటీ అక్రమ నిర్మాణాలపై దాడిచేస్తే రాధాకృష్ణ బాధపడ్డారట. హైదరాబాద్‌లో వందలు వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే, రెవెన్యూ కార్యాలయాలను తగులబెట్టి రికార్డులను ధ్వంసంచేస్తుంటే రాధాకృష్ణకు ఎప్పుడూ బాధ కలుగలేదు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని హైదరాబాద్‌కు ప్రమాదం ఏర్పడుతుంది? ఇదే రాధాకృష్ణ తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ నుంచి ఫార్మా పరిశ్రమలు కర్ణాటకకు తరలిపోతాయని, ఇంకా ఏవేవో పిచ్చి రాతలు తన పత్రికలో రాయించారు. రాధాకృష్ణ, చంద్రబాబుల కుట్రలు, కోరికలు ఏవీ నెరవేరలేదు. హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానమయిందే తప్ప వీళ్ల పిల్లి శాపనార్థాలేవీ పనిచేయలేదు. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రాంత వ్యాపారులుకానీ, పౌరులుకానీ ఈ ఐదేండ్లలో ఏరోజూ ఫిర్యాదు చేయలేదు. రాధాకృష్ణ, చంద్రబాబు అండ్ కో ఎంతటి అబద్ధాలకోరులో చెప్పటానికి నిన్నగాకమొన్న హైదరాబాద్ నగరంలో చంద్రబాబు కోడలు హెరిటేజ్ ఐస్‌క్రీమ్స్ ఉత్పత్తి ప్లాంటును ప్రారంభించటమే ఉదాహరణ. హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకుంటున్న వందలు వేల హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు, వ్యాపారవేత్తలు ఒక్కరయినా వీరి అబద్ధాలను సమర్థించారా! రాధాకృష్ణ మీడియాను అడ్డం పెట్టుకుని తమను ఎలా బ్లాక్‌మెయిల్ చేశారో చెప్పమంటే వీళ్లలో వందమంది ముందుకు వస్తారు అని ఒకనాటి రాధాకృష్ణ పారిశ్రామిక మిత్రుడు చెప్పారు. రాధాకృష్ణ చరిత్ర అది.



రాధాకృష్ణ మరో పెద్ద అబద్ధం నిస్సిగ్గుగా రాసిపారేశారు. చంద్రబాబు గెలిస్తే అమరావతి అద్భుత నగరంగా మారుతుందని, అప్పుడు అమరావతి ముందు హైదరాబాద్ వెలవెల పోతుందని, అందుకే కేసీఆర్ భయపడిపోయి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, పైగా ఆ విషయం కూడా ఒక టీఆర్‌ఎస్ నాయకుడే చెప్పారని ఒక పచ్చి అబద్ధాన్ని పచ్చగా రాసిపారేశారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సంకనాకించారు. ఒక పద్ధతి పాడూ లేకుండా రాష్ర్టాన్ని నాశనంచేశారు. రాజకీయ వేషాలు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోలేదు. అందుకే అందరితో సంఘర్షణ. పోలవరంలో చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు అని మొన్నటిదాకా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. ఇట్లా చెప్పాలంటే కొన్ని వందల అభిప్రాయాలు పూసగుచ్చి రాసుకుంటూ పోవచ్చు. ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాకరించిన అభ్యర్థులు, వారికి హైదరాబాద్‌తో ఉన్న సంబంధం ఎవరైనా కొంచెం పరిశోధిస్తే రాధాకృష్ణ, చంద్రబాబుల రంకుపురాణం బయటపడుతది. పూతలపట్టు టీడీపీ అభ్యర్థికి హైదరాబాద్‌లో ఏం ఆస్తులున్నాయని పోటీనుంచి తప్పుకొన్నారు? ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ టికెట్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టు బిల్లులన్నీ మంజూరుచేయించుకుని మరీ పార్టీ మారారు. బద్వేలు రాజశేఖర్ ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారు? నర్సాపురం రఘురామకృష్ణంరాజు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఎందుకు మారారు?
KCR is working to prevent AP development says babu
ఎందుకంటే చంద్రబాబు దివాలకోరు పాలనతో, రాజకీయాలతో విసిగిపోయి ప్రజల ఛీత్కారానికి గురికావడం ఇష్టం లేక పోటీనుంచి, పార్టీనుంచి తప్పుకొంటున్నారు. చంద్రబాబు ఈ ఐదేండ్లలో పొడిచిందేమీ లేదు. వచ్చే ఐదేండ్లలో పొడిచేదీ లేదు. అమరావతిని సింగపూర్ చేసినా హైదరాబాద్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. హైదరాబాద్‌కు, తెలంగాణకు వచ్చిన, వస్తున్న భారీ ప్రాజెక్టులే రాధాకృష్ణ అండ్ కో లకు సమాధానం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు, దీక్షాదక్షతలకు మరీ రాధాకృష్ణ వంటి ఒక పిపీలికం సర్టిఫికెట్ అవసరం లేదు. చంద్రబాబు అసలు సమర్థుడైన నాయకుడే కాదు. అన్ని సర్వేల్లోనూ అది మోగిపోతున్నది. చంద్రబాబు ప్రమోటీ నేత. రాధాకృష్ణ, ఇతర మీడియా సంస్థలు, ఒక సామాజికవర్గ పారిశ్రామికవేత్తలు ఆయన ప్రమోటర్లు. కుట్రలు, కుతంత్రాలతో ఎదిగిన నేత. ఆయన మంచి పాలనతో, సమర్థవంతమైన నాయకత్వంతో ఆంధ్రను కానీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ర్టాన్ని గానీ ఉద్ధరించింది ఏమీలేదు. అప్పుడు కూడా రాధాకృష్ణ వంటివారంతా క్రేన్లు, జాకీలు పెట్టి లేపితేనే ఆయన ఆ మాత్రం కొనసాగారు.

ఇప్పుడు కూడా అదే అబద్ధాలతో, అడ్డగోలు ప్రచారాలతో, బుకాయింపులతో ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలను మోసంచేయాలని చంద్రబాబు, రాధాకృష్ణ అండ్ కో తెగబడుతున్నది. రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని బరితెగిస్తున్నది. అందుకే మంచీమర్యాద, ఉచితానుచితాలు లేకుండా మాట్లాడుతున్నారు. జగన్ గెలిస్తే తెలంగాణవాళ్లతో కలిసి పోలవరం ఆపేస్తాడని తండ్రి వాగుతాడు. కొడుకేమో మచిలీపట్నం ఓడరేవు లేపుకెళ్త్తారంటాడు. ఇంకో పిచ్చోడేమో హైదరాబాద్ వెళితే కొడుతున్నారంటాడు. చైతన్యవంతమైన ఆంధ్ర ప్రజలకు ఇటువంటి సైకో రాజకీయ నాయకులు దాపురించడం విషాదం. వీళ్ల పిచ్చిని నయం చేయగలిగింది ఒక్క ఆంధ్ర ప్రజలు మాత్రమే. ఇవ్వవలసిన మందు ఓటు మాత్రమే.

– రాచకొండ సిద్ధార్థ

Read more RELATED
Recommended to you

Latest news