Malaika Arora: మలైకా అరోరాకు రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!

-

బాలీవుడ్‌ లో హీరోయిన్‌ మలైకా అరోరా రోడ్డు కలకలం రేపింది. పూణెలోని ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌ లో పాల్గొన్న మలైకా అరోరా నిన్న పగటి పూట తిరిగి.. ఢిల్లీ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన లో మలైవా.. నుదిటిపై స్వల్పంగా తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే నవీ ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

మలైకా అరోరా.. నుదిటి పై స్వల్పంగా గాయాలయ్యాయని.. సీటీ స్కాన్‌ లో అంతా బాగానే ఉందని అపోలో వైద్యలు స్పష్టం చేశారు. అంతేకాదు.. నిన్న రాత్రి ఆమెను డిశ్చార్జ్‌ కూడా చేసినట్లు సమాచారం అందుతోంది. పూణె నుంచి వస్తున్న సమయంలో.. ముంబై – పూణె ఎక్స్‌ ప్రెస్‌ హై వేపై ఖలాల్‌ పూర్‌ టోల్ ఫ్లాజా సమీపం లో మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీ కొన్నాయి. ఈ సంఘటన లోనే ఆమె గాయపడినట్లు సమాచారం అందుతోంది. మలైకా అరోరా ఆరోగ్యం నిలకడగా.. ఉందని ఆమె సోదరి అమతా అరోరా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news