ధ‌నుష్ అన‌గానే మేఘాల్లో తేలిపోతోంది!

-

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రం `పేట్ట‌`. ఈ మూవీ ద్వారా త‌మిళ తెర‌కు ప‌రిచ‌య‌మైంది మాళ‌వికా మోహ‌న‌న్‌. సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు. మోహ‌న‌న్ ముద్దుల కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన `ప‌ట్టం పోలె` సినిమాతో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అరంగేట్రం చేసింది. అయినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు.

త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన `మాస్ట‌ర్‌` మూవీలో హీరోయిన్‌గా న‌టించింది. త్వ‌ర‌లో ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ మూవీకి సంబంధించిన కార్టూన్ విష‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య్ ఫ్యాన్స్‌తో గొడ‌వ‌కు దిగి వార్త‌ల్లో నిలిచింది. ఇలాంటి హీయిన్‌కి ధ‌నుష్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. త‌ను న‌టిస్తున్న 43వ చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్‌కి హీరోయిన్‌గా అవ‌కాశం ఇచ్చాడు. త‌మిళంలో మూడ‌వ సినిమా కావ‌డంతో చాలా ఎగ్జైట్ అయిపోతోంది.

`ప్ర‌తీ ఇండ‌స్ట్రీలోని ఉత్త‌మ న‌టీన‌టుల‌తో క‌లిసి న‌టించాల‌ని ప్ర‌తీ ఒక్క‌రికీ వుంటుంది. త‌మ‌ళ్ లో నేను చేయ‌బోయే త‌దుప‌రి చిత్రం గురించి తెలియ‌జేయ‌డానికి చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎప్ప‌టి నుంచో ఇష్ట‌ప‌డే ధ‌నుష్‌ సార్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం ఇప్పుడు వ‌చ్చింది. ఈ సినిమా కోసం ఎంత‌గానే ఎదురుచూస్తున్నాను` అని తెలిపింది. ఈ చిత్రాన్ని కార్తీక్ న‌రేన్ రూపొందించ‌బోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news