చిత్ర పరిశ్రమలో మరో విషాదం..మమ్ముట్టి తల్లి కన్నుమూత

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

అయితే.. తాజాగా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో మమ్ముట్టికి సినీ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news