Exclusive : ఊరకనే అవుతారా స్టార్లు..!

-

కథ నడిపించే సినిమా నుండి హీరోలు నడిపించే సినిమా వరకు వచ్చింది.. సినిమా రేంజ్ ఏంటన్నది స్టార్ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది..

కథ నడిపించే సినిమా నుండి హీరోలు నడిపించే సినిమా వరకు వచ్చింది.. సినిమా రేంజ్ ఏంటన్నది స్టార్ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది.. ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు ల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తెలుగు పరిశ్రమలో స్టార్స్ గా ఎదిగారు. మోహన్ బాబు కూడా కలక్షన్ కింగ్ గా స్టార్ క్రేజ్ దక్కించుకున్నారు.

ప్రస్తుతం స్టార్ అంటే కోట్ల కొద్ది కలక్షన్స్ కొల్లగొట్టడమే.. టీజర్ నుండి సినిమా రిలీజై కలక్షన్స్ వసూళు చేయడమే కాదు ఆ సినిమా బుల్లితెర మీద రాబట్టే టి.ఆర్.పి రేటింగ్ మీద కూడా స్టార్ క్రేజ్ ఆధారపడి ఉంది. మహేష్, పవన్, ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ ఇలా ప్రస్తుతం స్టార్స్ అంతా తమ సినిమాల కోసం కష్టపడుతున్నారు.

టీజర్, ట్రైలర్ వ్యూస్, లైకులను పరిగణలో తీసుకుంటారు. అయితే స్టార్ రేంజ్ వచ్చింది కదా ఏ సినిమా చేసినా ఆడేస్తుంది అనుకుంటే పొరపాటే.. అంచనాలతో వచ్చిన స్టార్ సినిమా కూడా బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

రెండున్నర గంటల ఒక సినిమా చరిత్రలో మిగిలిపోతే అదే రెండున్నర గంటల సినిమా హీరో కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలే అవకాశం ఉంటుంది..

ఏ సినిమాకైనా హీరో పడే కష్టం ఒకటే.. కాని రెండున్నర గంటల ఒక సినిమా చరిత్రలో మిగిలిపోతే అదే రెండున్నర గంటల సినిమా హీరో కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలే అవకాశం ఉంటుంది..

ఇక స్టార్ ఇమేజ్ కోసం హీరోలు ఫిట్ నెస్ దగ్గర నుండి లుక్ విషయం వరకు చాలా కష్టపడుతుంటారు. ఇష్టం వచ్చినట్టు తినడానికి.. తాగడానికి వీలుండదు.. అంతేకాదు షూటింగ్ రకరకాల లొకేషన్స్ లో జరుగుతుంటే అన్ని లొకేషన్స్ కు తగినట్టుగా హెల్త్ ను సరిగా కాపాడుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంచుకున్న సినిమాకు కష్టపడాల్సి ఉంటుంది.

అందుకే స్టార్ కష్టం తెలుసుకుంటే ఊరకనే అవుతారా స్టార్లు అనక తప్పదు. ఇక వీరిలో కష్టంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోలు ఉన్నారు.. వారసత్వంతో అందుకుని హీరోలుగా కష్టపడుతున్న వారు ఉన్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలమో ఎలాంటి సంబంధం లేకుండా అభిమానులు సంపాదించుకుంటారు. ఆ అభినామ చూసి వారు పడుతున్న కష్టాన్ని సైతం మర్చిపోతారు మన హీరోలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version