తెగించేసిన మంచు లక్ష్మి.. షాక్ లో అభిమానులు..!

తాజాగా మలయాళం లో మోహన్ లాల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మాన్స్టర్. ఈ సినిమాలో లెస్బియన్ క్యారెక్టర్ లో మంచు లక్ష్మి రెచ్చిపోయి నటించగా ప్రస్తుతం ఇదే విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు వైశక్ తెరకేక్కించిన ఈ సినిమాలో మంచు లక్ష్మి కీలకపాత్ర పోషించింది. మంచు లక్ష్మి బ్యాడ్ లక్ పక్క పరిశ్రమలకు కూడా పాకిందని చెప్పాలి మోహన్ లాల్ కెరియర్ లో వరస్ట్ మూవీగా ఈ సినిమా నిలిచింది. అంతేకాదు మోహన్ లాల్ సినీ కెరియర్ లో మొదటి నుండి ఇంత దారుణమైన సినిమాను ఆశించలేదని ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇదే కాదు మోహన్ లాల్ కథ సెలెక్షన్ విషయంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇలా ప్రతి సినిమా ఒప్పుకొని చేయడం ఏమిటని కూడా విమర్శిస్తున్నారు. మాన్స్టర్ అంతటి దారుణ ఫలితాన్ని అందుకోవడంతో ప్రతి ఒక్కరూ మోహన్ లాల్ క్రేజ్ కి ఈ సినిమా సెట్ కాదంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో మంచు లక్ష్మి తెగించేసి నటించిందనే చెప్పాలి. మంచు లక్ష్మి నటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాన్స్టర్ మూవీలో ఆమె లెస్బియన్ రోల్ చేసింది. కథలో భాగంగా వచ్చే బోల్డ్ సన్నివేశాలలో మంచు లక్ష్మీ నటించడం గమనార్హం. అయితే ఒక అమ్మాయితో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మంచు వారి అమ్మాయి తెగింపు కి జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఇలాంటి పాత్ర చేయాలంటే ధైర్యం ఉండాలి.. అది కూడా స్టార్ కిడ్ అయ్యి ఉండి ఇలాంటి సన్నివేశాలలో నటించడం ఏంటి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రావడంతో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాలు కాస్త వెలుగులోకి వచ్చాయి.