సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుంది అన్నది చెప్పడం ఎవరి వల్లా కాదు. నలుగురుకి నచ్చింది అంటే అది అలా అలా నాలుగు కోట్ల మంది దాకా చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనిపిస్తుంది. ఇక సినిమా సెలబ్రిటీస్ వీడియోస్ అయితే మరింత ఫాస్ట్ గా జనాలకు రీచ్ అవుతాయి. లేటెస్ట్ గా అలాంటి ఓ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా వచ్చిన వెలిపడింతే పుస్తకం సినిమాలో ఓ పాటకు అక్కడ సెలబ్రిటీస్ అంతా డ్యాన్స్ చేశారు.
ఇక ఇప్పుడు ఆ పాటను జ్యోతిక నటిస్తున్న కాట్రిన్ మొళి సినిమాలో రీమిక్స్ చేశారు. బాలీవుడ్ సినిమా తుమ్హారీ సులు సినిమా రీమేక్ గా వస్తున్న ఈ కాట్రిన్ మొళి సినిమాలో జ్యోతిక లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాలో జిమ్మికి కమల్ అంటూ వచ్చే ఈ సాంగ్ లో జ్యోతికతో పాటుగా మంచు లక్ష్మి కూడా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ హల్ చల్ చేస్తుంది. కాట్రిన్ మొళి సినిమా ఈ నెల 16న రిలీజ్ కాబోతుంది. మీరు కూడా జిమ్మికి కమల్ సాంగ్ చూస్తూ డ్యాన్స్ వేసేయండి.