రజినితో ఆట మొదలుపెడుతున్న మహేష్

-

టైటిల్ చూసి అవాక్కవుతున్నారు కదా.. రజినికాంత్ తో మహేష్ ఆట మొదలు పెట్టడం ఏంటి విచిత్రంగా అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఏసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో మహేష్ బాబు ఓ థియేటర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎంబి సినిమాస్ పేరుతో ఆ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. అసలైతే ఆమీర్ ఖాన్ రీసెంట్ రిలీజ్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా అందులో రావాల్సి ఉన్నా ఇంకా నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆ థియేటర్ లో వేయలేదు.

ఇక రాబోతున్న సూపర్ స్టార్ రజినికాంత్ 2.ఓతో ఏఎంబి సినిమాస్ ఓపెన్ చేస్తారట. అంటే ఈ సూపర్ స్టార్ థియేటర్ లో మొదటి సినిమా ఆ సూపర్ స్టార్ ది కాబోతుందన్నమాట. 3డి విజువల్, 4డి ఆడియో ఎక్స్ పీరియన్స్ తో రజినికాంత్ 2.ఓ రిలీజ్ కాబోతుంది. అంతేకాదు ఈ థియేటర్ ఓపెనింగ్ కు రజినికాంత్ వస్తాడని టాక్. అదే జరిగితే మహేష్ థియేటర్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news