దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

-

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హోస్టుగా ఈటీవీ విన్ ఓటీటీలో ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే షో రాబోతోంది. డిసెంబర్‌ 15 నుంచి ఈటీవీ విన్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది.

- Advertisement -

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ షో ప్రోమో విడుదల కార్యక్రమంలో మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నానని.. ఈ విరామంలో తాను మరో జీవితాన్ని చూశానని చెప్పారు. గ్యాప్‌ తీసుకున్నా అభిమానులు తనపై చూపించిన ప్రేమాభిమానాలను బాధ్యతగా తీసుకుని రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇన్నేళ్లలో తనకు ధైర్యంగా నిలిచింది వాళ్లేనని..  సినిమాల నుంచి గ్యాప్‌ తీసుకున్నందుకు తనను క్షమించాలని కోరారు. ఇకపై వినోదం మరోస్థాయిలో ఉండనుందంటూ ఫ్యాన్స్ లో జోష్ పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...