ఏపీలో ఆ పార్టీకి ఓటు వేయండి – హీరో మంచు మనోజ్

-

ఏపీలో మంచి చేసే పార్టీకి ఓటు వేయండి అన్నారు హీరో మంచు మనోజ్. చిత్తూర్ లో హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అవగాహనతో కరెక్ట్ లీడర్ ను, పది మందిని కలుపుకుని వెళ్లే లీడర్ ను వెతుక్కోండి… వాళ్ల ఫ్యామిలీ, చుట్టుపక్కల వాళ్ళకు హెల్ఫ్ చేయలేని వాళ్లు మీకేం హెల్ఫ్ చేస్తారంటూ ఆగ్రహించారు. ఈ అంశాలను గుర్తు పెట్టుకుని ఏ లీడర్ వస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి… డబ్బులు ఉన్నాయి కదా అని ఇస్తే తీసుకోండి.. మీకు నచ్చిన వాళ్లకు ఓటేయండి అని చెప్పారు.

అందరు కలిసి ఉంటేనే దేశానికి బలం… ఈ మధ్య ప్రేమ కనిపించడం లేదు… ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతుందన్నారు.మనుషులను విభజించి పాలించకూడదు … ఒంటరిగా విజయం సాధించవచ్చు అని వెల్లడించారు. ఆ సాధించే క్రమంలో మీ వెంట ఉన్న వారిని మర్చిపోకండి… ప్రతి ఎదుగుదలలో కొత్త పరిచయాలు వస్తుంటాయని వివరించారు. కొత్త పరిచయాలు వచ్చాయని పాత పరిచయాలు వదిలేస్తే.. మనం మనుషులం కాదు మృగాలం అన్నారు. ఓటును డబ్బుకు అమ్ముకోకండి.. జీవితం ఎంతో ఉందన్నారు మనోజ్.

Read more RELATED
Recommended to you

Latest news