భువనగిరి పార్లమెంటు నుంచి సిపిఎం పార్టీ పోటీ ?

-

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి నుంచి పోటీ చేయాలని సిపిఎం పార్టీ ఆలోచన చేస్తోందట.

మల్లు లక్ష్మి, నంద్యాల నరసింహారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలలో ఒకరిని బరిలోకి నిలిపేందుకు సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం. అభ్యర్థి ఎంపికతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మిగతా పార్లమెంటు స్థానాలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని అంశంపై పోలిట్ బ్యూరో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ మరియు సిపిఐ పార్టీలు ప్రస్తుతం ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు గులాబీ పార్టీ ఒంటరిగా బర్లోకి దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news