జనసేనకు నా సపోర్ట్.. తారక్ వస్తే ప్రాణం అడ్డువేస్తా : మంచు మనోజ్

ఇన్నాళ్లు కేవలం సినిమా వాళ్ల మీద తన విమర్శలు ముక్కుసూటి తనం చూపించే మోహన్ బాబు శుక్రవారం ఏపి సిఎం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ధర్నా చేసిన విషయం తెలిసిందే. తన పిల్లలకు రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ రాకుండా చేస్తున్నాడని మోహన్ బాబు మండిపడ్డారు. అయితే ఎలక్షన్స్ టైంలో టిడిపి మీద నెగటివ్ మార్క్ పడేలా మోహన్ బాబు ఇలా చేస్తున్నారని.. స్కూల్ పేరుతో ఆయన వ్యాపారం చేస్తున్నాడని కొందరు టిడిపి నాయకులు అన్నారు.

ఇదిలాఉంటే ఈ ధర్నాలో తండ్రితో పాటుగా మంచు విష్ణు, మనోజ్ లు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈసారి తన సపోర్ట్ జనసేనకే అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. అయితే ఈసారికి ఎటైనా వేయండి కాని ఐదు, పదేళ్ల తర్వాత తారక్ పాలిటిక్స్ లోకి వస్తే అప్పుడేం చేస్తారని ఓ అభిమాని అడిగాడు. అప్పుడు నేను ఎటు వెళ్లినా తారక్ వస్తే తన ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా అని అన్నారు మనోజ్.

ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కు తన సపోర్ట్ ఇస్తూనే తారక్ వస్తే మాత్రం తన ప్రాణం అడ్డువేస్తానని అన్నాడు మంచు మనోజ్.