పార్ట్‌టైమ్‌ బినామీ

-

ఏ దేశంలోనైనా, బాధ్యత కలిగిన పౌరుడు(శారీరకంగా-మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు) సుఖంగా ఉన్నవారిని, కష్టాల్లోకి నెట్టాలనుకోడు. విద్యతో విజ్ఞానం సముపార్జించినవాడు ప్రశాంతతను భంగం చేయాలనుకోడు. ఓకవేళ అలా జరుగుతూందంటే, ఆ ఆజ్ఞానవాసి ఎవరో అందరికి తెలిసిపోతుంది. తెలిసిపోయింది కూడా..!

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ, పీకే (ఇలా పిలుచుకుంటేనే బెటర్‌. అదో తుత్తి) గారి మొరుగులు శృతిమించి పాకాన పడుతున్నాయి. ఒక మూర్ఖుడు, ఆవివేకి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో సమకాలీన ఓటరుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆయన. ఎవరి బిస్కెట్లకు ఆశపడుతున్నాడో, ఎవరి గెలుపుకు పాటుపడుతున్నాడో తెలియనంత అమాయకులేంకాదు ఆంధ్ర ప్రజలు. ఒక వ్యక్తికి సంబంధించిన విలువలు క్రమంగా దిగజారిపోతే, ప్రజలకు తెలియడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకూ తను ఆనందించవచ్చు. కానీ, ఉన్నట్టుండి పాతాళంలోకి జారిపోతే, జనం ఉమ్మేస్తారు. అందులో తడిసిపోవడానికి ఈ పీకే తొందరపడుతున్నాడు.

తెలంగాణ ఏమైనా పాకిస్తానా.. అని వదిరిన ఈ పీకే, ఇదే పాకిస్తాన్‌లోకి చెడ్డీలేసుకుని తిరిగిన సంగతి మర్చిపోయాడా.? పాతికేళ్ల క్రితం తన అన్న కాల్షీట్లు చేతబట్టుకుని మద్రాసు నెం.4, పోరూర్‌ సోమసుందరం స్ట్రీట్‌ నుండి, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.25 కి వచ్చినపుడు ఎంతమంది తెలంగాణవాళ్లు కొట్టారు.? ముగ్గురు పెళ్లాలతో ఇదే తెలంగాణలో సంసారం (?) వెలగపెట్టినప్పుడు ఎంతమంది తన్నారు.? పుట్టుక ఎక్కడిదయినా, బతుకంతా తెలంగాణలో. ఇప్పటిదాకా, ఈయన పీల్చిన గాలి, తాగిన నీళ్లు, తింటున్న తిండి అంతా తెలంగాణ వాళ్ల భిక్ష. వాళ్ల స్వేదం. సినిమాల పారితోషికం కింద ఈ అన్నదమ్ములు తీసుకుంది నైజాం ప్రదర్శన హక్కులు. వీళ్లను మెగాస్టార్లుగా, పవర్‌స్టార్లుగా నిలబెట్టింది తెలంగాణ. ఈనాడు ప్రదర్శిస్తున్న కండకావరమంతా తెలంగాణ పైసలతో పోగేసిందే. నిజానికి ఈయనకి గుండుగీసి, నులకమంచం పట్టె మీద కూర్చోబెట్టింది ఈయన రాష్ట్రంవాడే. సొంతూర్లో బూతులు తిట్టింది ఈయన రాష్ట్రంవాళ్లే. నిన్నటిదాకా నా బహిఃప్రాణమన్నవాడు, నేడు వేరేపార్టీలో ఉన్నాడు. ఆయనదీ అదే రాష్ట్రం. కానీ, ఇప్పడు కూడా ఉన్న ఓ కరుడుగట్టిన అభిమాని మాత్రం తెలంగాణ హీరో.

తరతరాల నుండీ ఎన్నో లక్షలమంది ఈ తెలంగాణలో సుఖసంతోషాలతో బతుకుతున్నారు. నవతరపు ఉద్యమంలో ఒక్కచుక్క రక్తం లేకుండా రాష్ట్రాన్ని సాధించిన గడ్డ తెలంగాణ. ఎన్నో మోసాలను, నమ్మకద్రోహాలను దిగమింగింది తెలంగాణ. ఇబ్బందులున్నాయని ఈయనతో వాపోయిన వాళ్లు ఆస్థులు హైదరాబాద్‌లో ఎన్ని ఉన్నాయి.? ఎలా వచ్చాయి.? కనీసం స్వభాషాభిమానమైనా లేకుండా, పాకిస్తాన్‌ అనడానికి నోరెలా వచ్చింది ఈ పీకేకి.? ఎటువంటి అన్యాయాలు లేకుండా, పచ్చగా బతుకుతున్న రెండు ప్రాంతాలవాళ్ల మధ్య చిచ్చుపెట్టడమేనా ఈయనగారి రాజకీయం.? ఇతగాడి ప్రవర్తనను హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులే అసహ్యించుకుంటున్నారు. తెలంగాణవాళ్లదాకా ఎందుకు.. ఇక్కడే ప్రశాంతంగా బతుకుతున్న ఆంధ్రకుటుంబాలు చాలు… ఈయన్ని ఉప్పుపాతరేయడానికి.

పరిణితి చెందిన నాయకులు ప్రతీమాటా హుందాగా, ఆచితూచి మాట్లాడుతారు. ఇతరులను విమర్శించేటప్పుడు కూడా బాధ్యతగా పదాలు వాడతారు. అక్కడేదో పబ్బం గడుపుకోవడానికి, ఇక్కడి వాళ్లను శత్రువులుగా చేయబూనడం కేవలం నీచులకే సాధ్యం. తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాలు, మహారాష్ట్ర-గుజరాత్‌లలాగా తీవ్రఘర్షణలతో విడిపోలేదు. భావోద్వేగాల సంఘర్షణే తప్ప మనుషుల మధ్య గొడవల్లేవు. ఆ మాటకొస్తే, విడిపోయినప్పుడు, విజయవాడకు తరలిన ఆంధ్ర ఉద్యోగులతో పాటు తెలంగాణ వాళ్లు కూడా కంటతడిపెట్టారు. బంధాలకుండే విలువది. ఆంధ్రప్రదేశ్‌ బాగుండాలని, ఆంధ్రప్రజలు బాగుండాలని తెలంగాణ సమాజం, ప్రభుత్వం ఎప్పుడూ కోరుకుంటాయి. కానీ పీకేలాంటి కొందరు పరాన్నజీవులే ‘విభజించి పాలించు’ సూత్రాన్ని పాటిస్తుంటాయి.

జనసేన అనేది తెలుగుదేశానికి బి(బినామీ)-టీం అని అందరికీ తెలుసు. ఎంతసేపు జగన్‌-కేసీఆర్‌లను కలిపి తిట్టడం, చిట్టినాయుడుపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టకపోవడం, 33కోట్ల అప్పున్నవాడు హెలికాప్టర్లలో తిరగడం లాంటి వ్యవహారాలు చెప్పకనే చెబుతుంటాయి ఎవరు ఎవరికి బినామీనో. సాధారణంగా అధికారపార్టీని విమర్శించడం వేరే పోటీపార్టీలకు ఆనవాయితీ. ఇక్కడ అదికూడా లేదంటే అర్థం ఏంటీ.? చంద్రబాబు ఇంతవరకు పొత్తులేకుండా పోటీ చేయలేదు. ఈసారి ట్రెండ్‌ మార్చి, వేరే పార్టీలు మనకెందుకు.? మనకే రెండు పార్టీలుంటే బెటర్‌ కదా అనుకున్నాడు. ఎలాగూ రెండు పేపర్లున్నాయి కదా. అంతే.. రెండోపార్టీ సిద్ధం. ఎక్కడో తెలంగాణలో ఒక్కసీటూ గెలవమనీ తెలిసీ, కాంగ్రెస్‌కు 500కోట్లు పంపగలిగినవాడికి, తన బి-పార్టీకి ఎంతిచ్చుంటాడో ఊహించుకోవచ్చు. అధికారం అవసానదశకు వచ్చినపుడు అటువంటి ఆలోచలే వస్తాయి. కాబట్టే ఇద్దరి మొహాల్లో ప్రేతకళ ఉట్టిపడుతోంది. ఓటమిభయం కళ్లల్లో కళ్లుపెట్టి చూస్తోంది. దాని ఫలితమే ఈ ఆందోళన, వేదికపై పూనకాలు, నోటిదూల… అయితే ఇవన్నీ కూడా సూచించేది జగనే నేత అని. హుందాగా మాట్లాడటం, చేసేదే చెప్పడం, స్థితప్రజ్ఞతతో నడచుకోవడం.. ఇవన్నీ విజేత లక్షణాలు. జగనే జగజ్జేత అని చెప్పడానికి ఇవి చాలు.

ప్రజారాజ్యం ఒకప్పుడు ఏం చేసిందో, జనసేన కూడా ఇప్పుడు అదే చేయబోతోందేమోనని పాపం.. జనసైనికులు ఆందోళన పడుతున్నారు. అందినకాడికి బుక్కేసి, ఆపై కాంగ్రెస్‌లో కలిపేసిన ప్రజారాజ్యం గతే జనసేనకూ పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. సేనను దేశంలో కలిపేసి, చేతులు దులుపుకుని, మళ్లీ హైదరాబాద్‌కొచ్చి… అంతా..తూచ్‌ అని అప్పిచ్చినవాళ్లుగా చూపించిన నిర్మాతలతో సినిమాలు చేయాలి. లెక్కలేని తిక్కకు చివరకు మిగిలేది అదే.

-రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news