మంచు విష్ణు ‘జిన్నా’ సినిమా ట్రైలర్ రిలీజ్

-

మంచు విష్ణు హీరోగా.. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోనీ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా జిన్నా. ఈ నెల 21న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ను ఇవాళ చిత్రబృందం విడుదల చేసింది. దసరా పండుగను పురస్కరించుకుని అఫీషియల్ థియరిటకల్ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

“జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు రా.. లోడ్ చేసిన గన్ను.. టచ్ చేస్తే దీపావళే” అంటూ మంచు విష్ణు చెప్పిన డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో మంచు విష్ణు టెంట్ హౌస్ నడుపుతుంటాడు. ఊరిలో వాళ్లందిరి దగ్గర అప్పులు చేస్తుంటాడు. పనిలో పనిగా ఈ సినిమాలోని విలన్ దగ్గర కూడా వడ్డీకి అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. ఈ ట్రైలర్ మొదలైన వెంటనే మంచు విష్ణు కామెడీతో అలరిస్తాడు. ఆయనకు తోడుగా  వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం అదరిపోయే పంచులు  విసురుతారు. వీరందరినీ చూస్తుంటే ఈ సినిమాలో ఫుల్ కామెడీ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news