మన్మథుడు 2 సినిమాకు నాగార్జున చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నాగ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలిన మన్మథుడు సినిమా టైటిల్‌ను వాడుకున్న నాగార్జున ఆ సినిమా వచ్చాక 17 ఏళ్లకు మళ్లీ మన్మథుడు 2 అంటూ నానా హంగామా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటుడు, ప్రముఖ సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్.
నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ సినిమా మరో మూడు సినిమాల పోటీ మధ్యలోనే శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అనసూయ కథనం – విశాల్ టెంపర్ రీమేక్ అయోగ్య – కన్నడ మహాభారతం డబ్బింగ్ కురుక్షేత్ర వచ్చాయి. అయితే సినిమాకు ఘోరమైన టాక్ రావడంతో తొలి ఆటకే ప్రేక్షకులు బెంబెలెత్తిపోయారు. సినిమా చూసిన ప్రేక్షకులే కాకుండా, రివ్యూవర్లు, క్రిటిక్స్ కూడా షాక్ అయ్యారు.
నాగ్‌కు ఈ వయస్సులో సరసాలు, ఘాటు రొమాన్స్, లిప్‌కిస్‌లు ఎందుకు ? అని ఫైర్ అవుతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో కామార్జున అని పోస్టులు పెట్టారు. ఏకంగా రూ.24 కోట్ల వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా తొలి రోజు తొలి ఆటకే తేలిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అటు ఓవర్సీస్లో కూడా ఘోరమైన వసూళ్లు తెచ్చుకుంది. ఈ వసూళ్లు చూస్తే నాగార్జునే షాక్ అవుతాడు.
యూఎస్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ $ 82,284 గ్రాస్ వసూళ్లు సాధించింది. శుక్రవారం $ 23,766 గ్రాస్ వసూళ్లతో ఇప్పటివరకు అక్కడ మొత్తం $ 1, 23,236 గ్రాస్ వసూళ్లు సాధించిందని తెలుస్తుంది. నాగార్జున రేంజ్‌కు ఈ వసూళ్లు చాలా తక్కువ. అసలే కొన్నేళ్లుగా సరైన సినిమాలు లేక సతమతమవుతోన్న నాగ్‌కు ఇప్పుడు మన్మథుడు 2 ప్లాప్ అవ్వడమే కాకుండా… మన్మథుడు పరువు కాస్తా తీసేసింది.