జగన్ ని పట్టుకున్న మీరాచోప్రా… కేసీఆర్?

-

తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ నెటిజన్లపై హీరోయిన్ మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మీరాచోప్రాపై కొంతమంది తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై ఎన్టీఆర్ కు కూడా పరోక్షంగా అప్పీలు చేసింది. ఈ విషయంపై కుష్బూ లాంటి వారు మీరా చోప్రాకు కాస్త వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఆ సంగతులు అలా ఉంటే… ఈ విషయంపై చేసిన ట్వీట్ కు జగన్ ను ట్యాగ్ చేయడంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి.

అయితే హీరోల ఇగోను టచ్ చేసిందంటూ మీరాచోప్రా పై సదురు హీరో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇది సహజంగా సోషల్ మీడియాలో జరిగే తంతే. అలా అని దీన్ని సమర్ధించడం కాదు కానీ… ఈ విషయంలో అభిమానులు అనబడేవారే కాస్త విజ్ఞత పాటించాలని కామెంట్లు వస్తుంటాయి. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు సదరు సెలబ్రెటీలు కూడా మరింత విజ్ఞత పాటించాలి! ఈ క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి మీరాచోప్రాపై ఆ హీరో అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ మీరా చోప్రా మాత్రం ఒక తెలుగు రాష్ట్ర సిఎంను ట్యాగ్ చేసి దీన్ని అరికట్టాలని కోరింది. దీనిపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

మీరాచోప్రాను బెదిరింపులకు గురిచేస్తున్న వారంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని.. తెలుగు రాష్ట్రాల అభిమానులు అని.. వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే ఎక్కువని జగన్ ను ఆమె ట్యాగ్ చేసారు. అయితే ఫిర్యాదు మాత్రం తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసింది మీరాచోప్రా. దీంతో… కంప్లైంట్ చేసిన స్టేట్ సీఎం ని వదిలేసి.. మీరా చోప్రా కేవలం సీఎం జగన్ ను మాత్రమే ట్యాగ్ చేసి దీన్ని అరికట్టాలని కోరింది. అంటే ఆమె దృష్టిలో తెలంగాణలో జూనియర్ కి ఫ్యాన్స్ లేరని అనుకుంటుందో ఏమో? దీంతో.. కేసీఆర్ ను ఎందుకు ట్యాగ్ చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా ఈస్థాయి విషయాలపై పోలీసులు, అందునా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయనే వార్తలు వచ్చే హైదరాబాద్ కు చెందిన సైబర్ పోలీసులు స్పందిస్తే చాలు కదా… ఇంతోటి దానికి ఏపీ ముఖ్యమంత్రి స్పందించాలా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా… తనకు ఎన్టీఆర్ గురించి తెలియదని, తాను ఎన్టీఆర్ అభిమానిని కాదని, మహేష్ బాబు అంటే తనకు ఎక్కువ ఇష్టమని చెప్పినందుకు మీరా చోప్రాను కొంతమంది నెటిజన్లు అసభ్య పదజాలంతో తిడుతూ ట్విట్టర్ వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలకు గౌరవం లేదా.. మా గొంతును వినిపించనివ్వరా అని వాపోయింది!

Read more RELATED
Recommended to you

Latest news