శివాజి రాజా కామెంట్స్ కు నాగబాబు పంచ్..!

57

‘మా’ అధ్యక్షుడిగా తనని ఓడించడానికి అపోనెంట్ నరేష్ కు సపోర్ట్ ఇచ్చిన నాగబాబుకి శివాజి రాజా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నాడు. చెప్పినట్టుగానే నాగబాబు మీద వ్యక్తిగత, రాజకీయ విషయాల గురించి అవహేళన చేశాడు. శివాజి రాజా కామెంట్స్ కు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా ఆర్టిస్టులు కొందరు అతనికి వార్నింగ్ ఇచ్చారు.


అయితే శివాజి రాజా కామెంట్స్ పై మెగా బ్రదర్ నాగబాబు ఎలా స్పందిస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.లేటెస్ట్ శివాజి రాజా కామెంట్స్ పై స్పందించారు నాగబాబు. శివాజి రాజా కామెంట్స్ ను చాలా లైట్ తీసుకున్నట్టుగా చెప్పారు నాగబాబు. మా అధ్యక్షుడిగా శివాజి రాజా చేసిన పనులు తనకి సంతృప్తినివ్వలేదని అందుకే ఈసారి నరేష్ ప్యానెల్ కు సపోర్ట్ ఇచ్చానని అన్నారు.మార్పు ఉండాలనే అలా చేశానని చెప్పారు. ఇక ఆయన చేసిన చిన్న చిన్న విషయాలపై కాకుండా పెద్ద పెద్ద విషయాల మీద తాను పోరాటం చేస్తానని శివాజిరాజాకి గట్టి పంచే ఇచ్చాడు.