ఇంటర్నేషనల్ డాన్స్ డే సంధర్భంగా “చిరు” సందేశంతో మెగా ట్రీట్ ..!

-

మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికి ముందు గుర్తొచ్చేది ఆనయ చేసే డాన్స్. మెగాస్టార్ సాంగ్స్ కి డాన్స్ చేసే ఫ్యాన్స్ కూడా కొన్ని లక్షల్లో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మెగా హీరోలు తమ ఫ్యాన్స్ కోసం డాన్స్ విషయంలో కఠినమైన స్టెప్స్ వేయడానికి ఎంతగానో శ్రమిస్తుంటారు. అంతేకాదు ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ని డాన్స్ మాస్టర్ గా చిత్ర పరిశ్రమకి తీసుకువచ్చి సపోర్ట్ చేసింది మెగాస్టారే.

 

Megastar Chiranjeevi reveals the secret of his dance movements

ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నేషనల్ డాన్స్ డే సంధర్భంగా ఎవరూ ఊహించని ప్రకటన చేసి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. చిరంజీవి ఈ రోజు సాయంత్రం అంతకముందు చేసిన డాన్స్ పెరఫార్మెన్సుకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తానని ఒక వీడియో ద్వారా తెలిపారు. ఈ సందర్భమగా నా ఎదుగుదలలో, కోట్లాది మంది అభిమానులను సంపాదించడంలో డాన్స్ ఎంతో కీలకపాత్ర పోషించింది వెల్లడించారు. ఇప్పుడు కూడా తన ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏకైక మార్గం డాన్స్ అని చిరంజీవి సూచించారు.

దీంతో చిరంజీవి విడుదల చేయనున్న ఆ డాన్స్ క్లిప్స్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రాం చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరోసారి కాజల్ అగర్వాల్ చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news