ఏపీలో కరోనా వ్యాప్తికి వైకాపా నేతలే కారణం… వారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే కరోనా పాజిటివ్ కేసులు.. వారు చేస్తుంది సేవ కాదు పబ్లిసిటీ స్టంట్ అంటూ పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబుకు సంబందించి… ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అవును… నలుగురు ముగ్గురు వైకాపా నేతలు కలిసి తిరిగితే అంతెత్తున లేచే చంద్రబాబు… సుమారు 60 – 70మంది ఒకచోట అది కూడా అత్యంత దగ్గరగా కూర్చిని బర్త్ డే సెలబ్రేషన్స్ చేయడాన్ని ఏమనుకోవాలి… ఎలా సమర్ధిస్తారో చూడాలి!
అవును… బాబు బర్త్ డే ఎప్పుడో వారం క్రితమే అయిపోతే… ఫోటోలు వెలుగులోకి రావడం కాస్త ఆలస్యమైనట్లుంది! ఈ విషయాలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ట్వీట్టర్ వేదికగా కరోనా విభృంజిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో… కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆ పని చేస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోస్తున్నారని సజ్జల ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని.. కరోనా లాంటి కష్టకాలంలో ఇలాంటి ఆరోపణలు ఏమాత్రం తగవని హితవు పలికారు. ఈ సందర్భంగా… కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? అని సజ్జల సూటిగా ప్రశ్నించారు.
నిజమే కదా జనాలు అందరికీ సూచనలు చేస్తున్నాను.. అంతా క్రమశిక్షణగా ఉండమని చెబుతున్నాను.. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని కోరుతున్నాను అని చెప్పే చంద్రబాబు… ఈ విషయం తన కార్యకర్తలకు, నాయకులకు చెప్పడం మరిచిపోయారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.