అభిమాని కుటుంబానికి రామ్ చరణ్ పది లక్షల సాయం….మ్యాటర్ ఏంటంటే….. ??

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 8, 2021న రిలీజ్ కానుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానుల్లో ఒకరైన నూర్ మహమ్మద్ అనే అభిమాని ఇటీవల హఠాత్తుగా అనారోగ్య కారణాల వలన మరణించిన విషయం తెలిసిందే. చిరంజీవి దగ్గరి నుండి రామ్ చరణ్ వరకు మెగా ఫ్యామిలీ అభిమానిగా కొనసాగుతూ, ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక అయి,

అప్పటి నుండి తన వంతుగా మెగా ఫ్యాన్ గా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నూర్ అంటే మెగాస్టార్ కు కూడా ప్రత్యేకంగా అభిమానం ఉండేది. అయితే గత ఏడాది నవంబర్ 8న ఆయన సడన్ గా నూర్ చనిపోయిన వార్త తెల్సుకున్న మెగాస్టార్ చిరంజీవి, నూర్ ఇంటికి వెళ్లి ఆయన మరణంపై నివాళులు అర్పించారు. ఆపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నూర్ ఇంటికి వెళ్లి తనవంతుగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఆ వార్త తో కొంత ఆవేదన చెందిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాట్లాడుతూ,

నూర్ గారు కొన్నేళ్లుగా నాన్న గారి వీరాభిమానిగా ఉంటూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారని, అటువంటి వ్యక్తి సడన్ గా చనిపోవడం నిజంగా ఎంతో బాధాకరం అని, కావున తవంతుగా ఆర్ధిక సాయం నూర్ గారి ఫ్యామిలీకి చేస్తానని మాటివ్వడం జరిగింది. అయితే ఇచ్చిన మాట మేరకు నేడు నూర్ ఫ్యామిలీ సభ్యులను కలిసిన రామ్ చరణ్, తన చేతుల మీదుగా వారికి రూ.10 లక్షల రూపాయల చెక్ ని అందించారు. ఇక తన అభిమాని మరణంతో ఆవేదన చెంది, వారి కుటుంబానికి తనవంతుగా ఆర్ధిక సాయం అందించిన చరణ్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news