అది నా వల్ల కాని పని.. రీమేక్స్‌పై చిరు కామెంట్స్‌

-

పలు భాషల్లో విజయం సాధించిన చిత్రాలను రీమేక్‌ చేసి తన కెరీర్‌లో సూపర్‌హిట్స్‌ అందుకున్నారు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). తాజాగా ఆయన ఓ బాలీవుడ్‌ బడా హీరోకు చెందిన సూపర్‌ హిట్‌ చిత్రాలపై స్పందించారు. ఆ హీరో చిత్రాలను తాను రీమేక్‌ చేయలేనని తేల్చి చెప్పేశారు. ఇంతకీ చిరు ఏ హీరో సినిమాల గురించి చెప్పారంటే.. ఆమిర్‌ఖాన్‌.

ఆమిర్‌ఖాన్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ . హాలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. నాగచైతన్య కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ చిరంజీవి సమర్పణలో విడుదల కానుంది. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, ఆమిర్‌ఖాన్‌, నాగచైతన్యలను నాగార్జున ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. దీనిలో నాగ్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమిర్‌ఖాన్‌, చిరు, చై సరదాగా సమాధానాలు చెప్పారు.

తాను హోస్ట్‌గా ముగ్గురు స్టార్‌లను ఇంటర్వ్యూ చేయడం అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం నాగ్‌.. ‘‘అవకాశం వస్తే ఆమిర్‌ నటించిన ఏ సినిమాలను మీరు రీమేక్‌ చేయాలనుకుంటున్నారు?’’ అని చిరుని ప్రశ్నించగా.. ‘‘నో.. నేను చేయలేను’’ అని సమాధానమిచ్చారు. మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమిర్‌కు వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను మెచ్చుకుంటూ చిరు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news