బ‌న్నీ కోసం క‌దిలిన మెగాస్టార్‌.. స్పెష‌ల్ సాంగ్‌లో స్టెప్పులు!

అల్లు అర్జున్ సినిమా అంటే హైప్స్ పీక్స్‌లో ఉంటాయి. ఇక ఇప్పుడు క్రియేటివ్ డైరెక్ట‌ర్ అయిన సుకుమార్‌తో చేస్తున్న పుష్ప విష‌యంలో అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మోస్ట్ వెయిటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ మూవీనుంచి రోజుకో క్రేజీ అప్‌డేట్ వ‌స్తోంది. మొద‌ట ఒక్క పార్టు అనుకుంటే రెండు పార్టులుగా తీస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక బీటౌన్‌కోసం స్పెష‌ల్ మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేశారు. ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. బ‌న్నీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజ్ అప్‌డేట్ వైర‌ల్‌గా మారింంది.

ఈ సినిమా కోసం మెగాస్టార్ క‌దిలి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చిరంజీవి కూడా మెరవబోతున్నారంటూ సెన్సేష‌న‌ల్ వార్త ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మామూలుగానే సుకుమార్ మూవీలంటే స్పెషల్ సాంగ్ కంపెల్సీరీగా చాలా క్రియేటివ్‌గా ఉంటుంద‌ని తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పుష్ప కోసం కూడా ఓ స్పెషల్ మాస్ అప్పీరెన్స్ సాంగ్‌లో బన్నీ కోరిక మేరకు చిరంజీవి కూడా చిందేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో సినిమాకు కూడా మంచి హైప్ క్రియేట్ అవుతుంద‌ని సుకుమార్ భావిస్తున్నారంట‌. త్వ‌ర‌లోనే దీనిపై అప్‌డేట్ రానుంది.