తన మాటే శాసనం అని నిరూపించుకుంటున్న మెగాస్టార్….!!

-

టాలీవుడ్ హీరో మెగాస్టార్ నటిస్తున్న తాజా సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాపై గట్టిగా దృష్టిపెట్టారు మెగాస్టార్. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్, కేవలం 5 నెలల వ్యవధిలో ఆ సినిమా పూర్తి అవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, తమ తదుపరి సినిమా కూడా 100 రోజుల్లోపే పూర్తి చేయాలని ఆ స్టేజ్ మీద కొరటాల శివను కోరడం జరిగింది.

 

దానికి శివ కూడా ఓకే సర్ అంటూ సుముఖత వ్యక్తం చేసారు. ఇక అనుకున్న విధంగా ఇటీవల ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోందని, ఇక రాబోయే షెడ్యూల్స్ లో కూడా ఎక్కడా ల్యాగ్స్ లేకుండా చకచకా పనులు కానిచ్చేలా దర్శకుడు శివ పక్కాగా అన్ని ప్లాన్స్ సిద్ధం చేసారని, ఇక ఇటీవల మణిశర్మ సంగీత దర్శకత్వంలో ట్యూన్స్ కూడా సిద్ధం చేయించిన కొరటాల, మెగాస్టార్ కి ఇచ్చిన మాటను ఒక శాసనంగా పాటించి షూటింగ్ ని పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు.

 

Chiranjeevi Begins Shoot in Palasa

ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి, మే సమయానికల్లా ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అవుతుందని, అనంతరం వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు చెప్తున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ చొరవ వలన ఈ విధంగా ఆయన సినిమా షూటింగ్ ఇంత వేగంగా జరగడం ఎంతైనా శుభ పరిణామం అని, ఈ విధంగానే పలు ఇతర హీరోల సినిమాల విషయంలో కూడా జరిగితే, ఇకపై స్టార్ హీరోల నుండి కూడా తప్పకుండా సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి అది ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news