మెగా ఛాన్స్ పట్టేసిన మేఘా ఆకాష్..!

-

తమిళ అమ్మాయి మేఘా ఆకాష్ మాత్రు భాషలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నా తెలుగులో చేసిన రెండు సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈమధ్య రజిని పేట సినిమాతో అలరించిన మేఘా ఆకాష్ తెలుగులో మరో లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ తో మేఘా ఆకాష్ జోడీ కడుతుంది. బుచ్చిబాబు డైరక్షన్ లో సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ముందు 2 కంట్రీస్ ఫేం మనీషాని హీరోయిన్ గా అనుకున్నారు.

కాని ఎందుకో ప్రాజెక్ట్ నుండి ఆమెను తప్పించి మేఘా ఆకాష్ కు ఛాన్స్ ఇచ్చారు. సుకుమార్ అందించిన కథతో వస్తున్న ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మేఘా ఆకాష్ కు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న మేఘాకి వైష్ణవ్ తేజ్ సినిమాతో అయినా హిట్టు దక్కుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version