తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన సినీ ప్రముఖులు

-

హల్లో… ఎక్కడున్నారు. వెళ్లి ఓటేసి రండి. ఈరోజు హాలీడే కదా.. జాలీగా తిరుగుదామని అనుకోకండి. ముందుగా వెళ్లి ఓటేసి రండి. తర్వాతే ఏ పని అయినా? సినిమా సెలబ్రిటీల సినిమాలు చూడటమే కాదు.. వాళ్లు చేసే పనులను చూసి కూడా మనం ఇన్ స్పైర్ అవ్వాలి. సినీ హీరోలు చూడండి. పొద్దున్నే లేచి వెళ్లి లైన్ లో నిలబడి మరీ ఓటేశారు.

మనం ఓటు వేస్తేనే మనకు ప్రశ్నించే హక్కు, అధికారం ఉంటుందని ప్రముఖ హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆయన ఇవాళ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33 లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద తన ఓటేశారు. అల్లు అర్జున్ అక్కడికి చేరుకునే సరికి అప్పటికే అక్కడ చాలామంది క్యూలైన్ లో ఉన్నరు. అయినప్పటికీ.. అర్జున్ చాలా సేపు వెయిట్ చేసి ఓటేసి వెళ్లారు.

ఇదే పోలింగ్ బూత్ లో అల్లు అర్జున్ తో పాటు నటుడు పోసాని కృష్ణ మురళి ఓటేశారు. మరో ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీతో సహా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎన్టీఆర్ ఓటేశారు.

అక్కినేని అమల, మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version