బిగ్‌బాస్ 4: అఖిల్‌‌కి షాకిచ్చిన మెహ‌బూబ్‌..అభికి ప్ర‌చారం!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 రోజులు గ‌డుస్తున్నా కొద్దీ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే షో 70 రోజులు పూర్తి చేసుకుంది. మ‌రో నెల రోజులు మాత్ర‌మే వుండ‌టంతో కంటెస్టెంట్‌ల‌లో అస‌లు రంగు బ‌య‌టికి వ‌స్తోంది. ఈ వీకెండ్‌లో త‌క్కువ ఓట్లు పోల్ కావ‌డంతో దిల్‌సే మెహ‌బూబ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బ‌య‌టికి వ‌చ్చేశాడు. వ‌స్తూ వ‌స్తూ హౌస్‌లో త‌న‌కు ఇష్ట‌మైన వారిని ఆట మెరుగు ప‌రుచుకోమ‌ని క్లారిటీగా చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

త‌న బెస్ట్ ఫ్రెండ్ సోహైల్ గురించి ఎమోష‌న‌ల్ అయిన మెహ‌బాబూబ్ .. అభిజిత్ గురించి పాజిటివ్‌గా మాట్లాడటం నాగ్‌తో పాటు సోహైల్‌ని కూడా షాక్‌కు గురిచేసింది. నిత్యం అభికి దూరంగా వుండే సోహైల్‌తో వుండే మెహ‌బూబ్ బ‌య‌టికి వ‌స్తూ అభిని స‌పోర్ట్ చేయ‌డం.. ఆట తీరుని 200 ప‌ర్సెంట్ పెంచేయాల‌ని చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

ఇదిలా వుంటే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మెహ‌బూబ్ హౌస్‌లో త‌నకు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ల‌కు ఓటు వేయ‌మ‌ని ఇన్‌స్టా వేదిగా ప్రేక్ష‌కులని కోరాడు. ఆ ఇద్ద‌రిలో సోహైల్ ఒక‌రు. మ‌రో వ్య‌క్తి అభిజీత్‌. అభిషోటోని షేర్ చేసిన మెహ‌బూబ్ అత‌నికి ఓట్ వేయాల్సిందిగా కోరాడు. ఇది సోహైల్ అభిమానుల‌కు షాకిస్తోంది. అభికి సోహైల్‌కి ప‌డ‌దు.. అలాంటిది మెహ‌బూబ్ .. అభిని స‌పోర్ట్ చేయ‌డ‌మేంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు. ప్ర‌స్తుతం మెహ‌బూబ్ ఇన్ స్టా పోస్ట్ వైర‌ల్‌గా మారింది.