ఆ వీడియో చూసి నోరెళ్లబెట్టిన సమంత..!

-

పెళ్లయిన తర్వాత చైసామ్ జంటగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానప్పటికీ.. ఆ మూవీని నిన్ను కోరి డైరెక్టర్ శివ డైరెక్టర్ కాగా… సాహు, హరీశ్ పెద్ది నిర్మాతలు. ఆ సినిమాకు మజిలీ అనే టైటిల్ పెట్టినట్టు సమాచారం.

ఆ మూవీకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. సమంత డైహార్ట్ ఫ్యాన్ ఒకరు ఆ మూవీ మేకింగ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోను షేర్ చేసి సమంత, చైతన్యను టాగ్ చేసింది. ఇక.. ఆ వీడియోను చూసిన సమంత ఒక్కసారిగా షాక్ కు గురయింది. ఆ వీడియోకు రిప్లయి ఇస్తూ నోరెళ్లబెట్టిన ఎమోజీలను సమంత పోస్ట్ చేసింది. తర్వాత కొంతసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది సమంత.

Read more RELATED
Recommended to you

Latest news