Mike Tyson: అత్యుత్సాహానికి మూల్యం..ఫ్లైట్‌లోనే వ్యక్తిని చితక్కొట్టిన మైక్ టైసన్..వీడియో వైరల్

-

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి అందరికీ తెలుసు..ఈయన ఇటీవల ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ మాత్రమే కాదు డైనమిక్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్(LIGER)’ చిత్రంలో నటించాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మధ్య పోరాట సన్నివేశాలు చిత్రంలో చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే..మైక్ టైసన్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సదరు వీడియో వివరాల్లోకెళితే..మైక్ టైసన్ ఇటీవల ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ఓ అభిమాని అయిన వ్యక్తి వచ్చి మైక్ టైసన్ తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించాడు. మైక్ టైసన్ వద్దని వారిస్తున్నా వినకుండా..మైక్ టైసన్ ను తన కెమెరాలో బంధించబోయాడు. ఈ క్రమంలోనే తన ఫోన్ లో మైక్ వీడియో రికార్డ్ చేస్తూ..‘మైక్..మైక్..’ అని అరుస్తున్నాడు. ఇక అప్పటి వరకు ఊరుకున్నా మైక్ ఒక్కసారిగా ఊగిపోయాడు.

నిశ్శబ్దంగా కూర్చోవాలని చెప్పినా వినడం లేదని సదరు వ్యక్తిపైన మైక్ టైసన్ పిడిగుద్దులు కురిపించారు. దాంతో ఆ వ్యక్తి ముఖం పగిలిపోయింది. తోటి ప్రయాణికులు మైక్ ను ఆపే ప్రయత్నం చేశారు. ఇదంతా రికార్డు చేసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘మైక్ టైసన్ ను ఇరిటేట్ చేస్తే అంతే సంగతులు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news