Big Boss Non Stop: ‘బిగ్ బాస్’లో సరి కొత్త కథ..ఆ కంటెస్టెంట్‌కు ఐ లవ్ యూ టూ చెప్పిన నాగార్జున

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షోలో ఆరోవారం ముగిసింది. ఇంటి నుంచి శ్రవంతి, ముమైత్ ఖాన్ లు బయటకు వచ్చేశారు. అయితే, ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. కంటెస్టెంట్స్ కు హోస్ట్ అక్కినేని నాగార్జున క్లాస్ తీసుకుంటూనే సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం ఎపిసోడ్ లో సరి కొత్త కథ తెరమీదకు వచ్చింది.

కాన్ఫరెన్స్ రూమ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ అందరి అభిప్రాయం పలు విషయాలపైన తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు కూడా. కాగా, మిత్రా శర్మ మాత్రం ఏకంగా నాగార్జునకే లైన్ వేసిందని చెప్పొచ్చు. తన టర్న్ వచ్చినపుడు మాట్లాడిన మిత్రా శర్మ.. నేను మంచిదానినేనా నాగ్ సార్ మీ అభిప్రాయం చెప్పండి అని ఏకంగా బిగ్ బాస్ హోస్ట్ ని అడిగేసింది.

ఈ క్రమంలోనే మిత్రా శర్మ నాగార్జునకు ఐ లవ్ యూ సార్ అని చెప్పేసింది. దానికి నాగార్జున కూడా ఆసక్తికర రిప్లయి ఇచ్చారు. ‘ఐ లవ్ యూ టూ’ అని చెప్పేశారు.దాంతో కంటెస్టెంట్స్ అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ విషయమై సోషల్ మీడియాలో బోలెడంత డిస్కషన్ కూడా జరుగుతోంది.

నాగార్జున స్పోర్టివ్ గా అలా లవ్ యూ టూ అని చెప్పి గేమ్ కంటిన్యూ చేశాడని బీబీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ ఓటీటీ 24 బై 7లో ఈ సారి వెరీ డిఫరెంట్ గా గేమ్ ఉండబోతున్నదని ఇప్పటికే అందరికీ అర్థమయి ఉంటుందని, టైటిల్ విన్నంగ్ వెరీ టఫ్ గేమ్‌గా ఉంటుందని బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news