ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలను చేస్తున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ని చేసారు అంటే మంచిగా డబ్బులు వస్తాయి. మరి ఇంక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే…
పెళ్లిళ్లు ఇది వరకు లాగ జరగట్లేదు. ఇప్పుడు పెళ్లిళ్లు పద్ధతి మారిపోయింది. చాలామంది ఓపిక లేక వెడ్డింగ్ ప్లానర్స్ ని పెట్టుకుంటున్నారు. పైగా ఇందుకు సరిపడా డబ్బులని వాళ్ళు ముందే మాట్లాడుకుని వెడ్డింగ్ ప్లానర్స్ పెళ్లి పనులు చేస్తున్నారు. ఫుడ్డు, డెకరేషన్ ఇలా ప్రతి దానిని కూడా వాళ్ళే చూస్తున్నారు ఇది నిజంగా ఇప్పుడు కెరీర్ ఆప్షన్ గా మారిపోయింది. డిమాండ్ కూడా బాగా పెరుగుతుండటంతో చాలా మంది వెడ్డింగ్ ప్లానింగ్ కి సంబంధించిన కోర్సు చేస్తున్నారు చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి.
ఈ కోర్సు చేసి వెడ్డింగ్ ప్లానర్ గా మారచ్చు. వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు తప్పకుండా ఒక ఆఫీస్ కావాలి. లేదంటే మీరు మీ ఇంట్లోనే ఆఫీస్ ని మొదలు పెట్టొచ్చు. దీని ద్వారా మీరు ఫుడ్, టెంట్ హౌస్ వాళ్ళతో మాట్లాడుకుని ముందే ఎగ్రిమెంట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏదైనా పెళ్లి కాంట్రాక్ వచ్చిందంటే మీరు వాళ్ళని నియమించవచ్చు.
బడ్జెట్ ని మీరు ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది దీనికోసం మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. మీరు తీసుకునే అడ్వాన్స్ ని బట్టి మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది. సొంతంగా డబ్బులు ఏమి పెట్టక్కర్లేదు. ఎలా చూసుకున్నా నెలకు 50 వేల రూపాయల వరకు మీరు పొందొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ను బట్టి ఇది పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా వెడ్డింగ్ ప్లానర్ గా మీరు మంచిగా రాబడి పొందొచ్చు అలానే ఎలాంటి రిస్క్ కూడా దీని వల్ల మీకు ఉండదు.