ఆస్కార్ అవార్డుల వేడుకలో తెలుగు సినిమా పాట చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లు అందుకున్నారు. వేదికపై అవార్డు అందుకున్న అనంతరం పురస్కారంతో అభివాదం చేశారు. అనంతరం కీరవాణి ఆస్కార్ వేదికపై పాట పాడారు.
‘నా మనసులో ఎప్పుడూ ఒకే ఆలోచన.. రాజమౌళి, నా కుటుంబానిదీ అదే ఆశ. ఆర్ఆర్ఆర్ తప్పకుండా ప్రతి భారతీయుడి గౌరవాన్ని అందుకోవాలి. నన్ను ప్రపంచ అగ్రభాగాన నిలబెట్టాలి.’ అంటూ కీరవాణి పాట అందుకున్నారు. ఆయన పాటకు డాల్బీ థియేటర్లో ఉన్న తారలంతా చప్పట్లు కొట్టారు.
ఆస్కార్ అకాడమీకి కీరవాణి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా దేశాన్ని గర్వపడేలా చేసిందని అన్నారు. ఆర్ఆర్ఆర్.. తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని చెప్పారు. అనంతరం నాటు నాటు గీత రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ అభివాదం చేశారు.
@mmkeeravaani #NaatuNaatuSong #Oscars #RRRForOscars @RRRMovie pic.twitter.com/VM0iS4V7S5
— BA Raju's Team (@baraju_SuperHit) March 13, 2023