పుట్టిన రోజున ఒంటరిగా మోహన్ లాల్..ఎందుకో తెలుసా?

మే 21..(శనివారం) మాలీవుడ్ (మలయాళం) కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో #HBD MohanLal హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన నటిస్తున్న చిత్రాల అప్ డేట్స్ ఇచ్చారు.

తాజాగా ఆయన నటిస్తున్న ‘ఎలోన్(ఒంటరి)’ ఫిల్మ్ టీజర్ రిలీజ్ చేశారు. సదరు టీజర్ లో మోహన్ లాలా చాలా కొత్తగా కనిపించారు. ఏధైనా సాధించాలంటే కచ్చితంగా ఒంటిరిగానే ఉండాలని, ఒంటరిగా ఉన్న వారే జీవితంలో విజయం సాధించారని మోహన్ లాల్ చెప్పిన డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

ఇక ‘ఎలోన్’.. థ్రిల్లర్ ఫిల్మ్ కాగా, ఇది కూడా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. తాజాగా విడుదలైన ‘12th Man’ కు కూడా చక్కటి రెస్పాన్స్ వస్తోంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోని పెరుంబవూర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మోహన్ లాల్ ‘బరోజ్, మాన్ స్టర్’ సినిమాలు చేస్తున్నారు. ‘బరోజ్..గార్డియన్ ఆఫ్ డీ గామాస్ ట్రెజర్’ సినిమాకు మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఆయన దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం ఇది. కాగా, ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.