రెచ్చిపోయిన లోన్‌యాప్స్‌ ఏజెంట్స్‌.. యువతికి వేధింపులు

-

రోజు రోజుకు లోన్‌ యాప్స్‌ ఏజెంట్ల వేధింపులు తారాస్థాయికి చేరాయి. ఇన్స్టా లోన్ పేరుతో ఈజీగా రుణాలు ఇచ్చి.. వడ్డీల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. అయితే.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన యువతిని రుణం చెల్లించడం లేదంటూ కేటుగాళ్లు అసభ్య పదజాలంతో వేధించారు. తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేశారు. ‘నీ ఫోన్‌ నంబర్‌ను 500 మంది పురుషులకు ఇచ్చి అసభ్యకరంగా ప్రవర్తించేలా చేస్తాం’ అని బెదరింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేని యువతి సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించింది. సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సంపాదించారు. ఈ దారుణ దందాలో చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు.

బెంగళూరు కేం ద్రంగా నడుస్తున్న ఈ దందా ఆటకట్టించారు. చైనా నిందితుల కనుసన్నల్లో పనిచేస్తూ దేశంలో దందాను కొనసాగిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 73 ల్యాప్‌టా‌ప్‌లు, 29 మొబైల్స్‌, డెబిట్‌ కార్డులు-2, హార్డ్‌ డిస్క్‌లు 2 స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావుభూపాల్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఇన్‌స్టెంట్‌ లోన్‌ పేరుతో యాప్‌లను అప్‌లోడ్‌ చేసి నిందితులు ఈ దందాకు పాల్పడుతున్నారు. 2020, 2021లో చైనాకు చెందిన చెన్‌చామోపింగ్‌ అనే నిందితుడు బెంగళూరు కేంద్రంగా గోల్డెన్‌ బ్యాగ్‌ టెక్నాలజీస్‌ పేరుతో ఇన్‌స్టంట్‌ దందా కొనసాగించి వేలాది మంది యువతను వేధింపులకు గురిచేశాడు. అక్రమంగా రూ. కోట్లు సంపాదించాడు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇండియా వదిలి పారిపోయాడు. కొంతకాలం విరామం ఇచ్చిన కేటుగాడు తిరిగి ఇండియాలో తన యాప్‌ రుణ దందాను కొనసాగించాలని పథకం వేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news