ప‌వ‌న్ పై నాగ‌బాబు కామెంట్లు.. త‌మ్ముడిపై ఎన‌లేని ప్రేమ‌!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే ఎన్నో వార్తలు, క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ ఈ ఇద్ద‌రు మాత్రం త‌మ మ‌ధ్య అలాంటివేవీ లేవ‌ని ఇన్ డైరెక్ట్ గా చెబుతూనే ఉన్నారు. అయితే జ‌న‌సేన‌కు నాగబాబు దూరంగా ఉంటున్నార‌నేది కాద‌న‌లేని వాస్త‌వం. దీంతో మ‌ళ్లీ ఏదో జ‌రిగిందంటూ టాక్ న‌డుస్తోంది. అయితే వీట‌న్నింటికీ పులిస్టాప్ పెట్టేశారు నాగ‌బాబు. అదెలా అంటారా అయితే పూర్తిగా చ‌ద‌వండి.


ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఏదైనా అంటే సోష‌ల్ మీడియా ద్వారా గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు నాగ‌బాబు. నిన్న కూడా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కింగ్ కంటే గొప్ప‌వాడ‌ని పొగిడారు. రాజు కేవ‌లం త‌న ప‌ద‌వి గురించి మాత్ర‌మే ఆలోచిస్తార‌ని, కానీ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ప‌ద‌వి కంటే ప్ర‌జ‌ల గురించే పోరాడుతార‌ని చెప్పుకొచ్చారు. రాజు చేసే దౌర్జ‌న్యానికి వ్య‌తిరేకంగా హీరో పోరాడుతార‌ని ప‌వ‌న్ గురించి చెప్పారు. నిత్యం ఏదో ఒక విష‌యంపై స్పందించే నాగబాబు ఈ సారి త‌మ్ముడిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం కొవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఇక నాగబాబు కామెంట్ల‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.