తండ్రి పాడేను కారు మీద కట్టి తీసుకెళ్ళాడు…!

ఒక వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని తన కారు పైకప్పుకు కట్టి తీసుకువెళ్తున్న ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తుంది. అంబులెన్స్‌ కోసం ప్రయత్నం చేసి చేసి చివరికి దొరకక తన తండ్రి శవాన్ని స్మశాన వాటికకు తీసుకువెళ్ళాడు. ఆగ్రా లోని మోక్షాధమ్‌లో ఉన్న శ్మశానవాటికకు తన తండ్రి శవాన్ని తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాడు. భయంకరమైన దృశ్యం శ్మశానవాటికలో చాలా మందిని కన్నీరు పెట్టించింది.

ఆగ్రాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే అవి పెద్దగా ఫలితం ఇవ్వలేదు. అంబులెన్స్‌ల కొరత నేపధ్యంలో  కోవిడ్ -19 బాధితుల మృతదేహాలను స్మశాన వాటికకు తీసుకువెళ్ళడానికి ఒక్కొకరికి దాదాపు ఆరు గంటలకు పైగా సమయం పడుతుందని అధికారులే అంటున్నారు. ఆగ్రాలోని ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను జాయిన్ చేసుకోవడం లేదని సమాచారం. సమీప జిల్లాలు అయిన  మెయిన్‌పురి, ఫిరోజాబాద్ మరియు మధుర నుంచి రోగులను ఆగ్రా పంపిస్తున్నారు.