టాలీవుడ్ లో ప్రస్తుతం లిప్ లాక్ ట్రెండ్ కొనసాగుతుంది. చిన్న సినిమాలకు లిప్ లాక్ ఓ బ్రహ్మాస్త్రంగా మారిందని చెప్పొచ్చు. ఎలాంటి జానర్ సినిమా అయినా హీరో హీరోయిన్ మధ్య ఘాటు ముద్దు సీన్ అవసరం ఉన్నా లేకున్నా ఇరికించేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి, ఈ ఇయర్ ఆరెక్స్ 100 మూవీస్ ప్రేక్షకుల్లోకి వెళ్లేందుకు ముందు మూతి ముద్దులే బాగా ఎట్రాక్ట్ చేశాయి.
సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా ఈమధ్య ముద్దుల హంగామా ఎక్కువైందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఈ లిప్ లాక్ ట్రెండ్ అక్కినేని యువ హీరో నాగ చైతన్య కూడా కొనసాగిస్తున్నాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చైతు సినిమాలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ తో ముద్దు సీన్ చేశాడు. అయితే అది అర్జున్ రెడ్డి, ఆరెక్స్ 100లా ఘాటు ముద్దు కాదు. పెదాలు కలవడం మాత్రమే జరిగింది.
టాలీవుడ్ లో లిప్ లాక్ ట్రెండ్ మొదలు పెట్టింది మారుతినే అని చెప్పొచ్చు. ఈరోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో అడల్ట్ కంటెంట్ పెట్టి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శైలజా రెడ్డిలో చైతు, అను ల మధ్య రొమాన్స్ మీద కాన్సెంట్రేట్ చేశాడు. మరి చైతు ఈ ముద్దుల హంగామా కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.