రామ్ చ‌ర‌ణ్ క‌థ‌లో కింగ్ వార‌సుడు

486

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థ‌లో కింగ్ నాగార్జున వార‌సుడు న‌టిస్తున్నాడా? అంటే అవున‌నే స‌మాచారం. చ‌ర‌ణ్ క‌థేంటి? కింగ్ వార‌సుడు ఏంటి అనుకుంటున్నారా? అయితే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ ద‌ర్శ‌కుడు మేర్ల పాక గాంధీ చ‌ర‌ణ్ కోసం అప్ప్లట్లో ఓక‌థ సిద్దం చేసిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కూడా క‌థ‌కు ఫిదా అయిన సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు. దీన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మించ‌నుంద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో చ‌ర‌ణ్ వేరే సినిమాలో బిజీగా ఉండ‌టంతో ప్రాజెక్ట్ డిలే అయింది. దీంతో గాంధీ శ‌ర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా తెర‌కెక్కించాడు. కానీ ఆ సినిమా అంచ‌నాల‌ను అందుకోలేకపోయింది.

Naga Chaitanya in Merlapaka Gandhi’s next?

అటుపై నానితో తీసిన కృష్ఱార్జున యుద్దం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. దీంతో రామ్ చ‌ర‌ణ్ ప్లాప్ ల్లో ఉన్న ద‌ర్శ‌కుడితే సినిమా ఎలా చేస్తాన‌ని నెమ్మ‌దిగా గాంధీ నుంచి ఎస్కేప్ అయ్యాడు. రెండు ప్లాప్ ల నేప‌థ్యంలో గాంధీకి అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. దాదాపు ఏడాదిగా ఖాళీగానే ఉన్నాడు. అయితే ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌కు రామ్ చ‌ర‌ణ్ కోసం సిద్దం చేసిన క‌థ‌ను వినిపించాడుట‌. ఇమేజ్ తో సంబంధం లేకుండా రెడీ అయిన క‌థ‌లో హీరో ఎవ‌రైనా ఒక‌టేన‌ని భావించి చై క‌థ‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడుట‌. అప్ప‌టికే చై డేట్లు యూవీ క్రియేష‌న్స్ లో లాక్ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చిత్రాన్ని ఆ సంస్థే నిర్మించాడ‌నికి ముందుకు వ‌చ్చిందిట‌.

ఇదొక థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ అని స‌మాచారం. క‌థే హీరోగా సాగే చిత్ర‌మ‌ని అంటున్నారు. అందువ‌ల్లే చ‌ర‌ణ్ కొన్ని విష‌యాలు ఆలోచించి వెన‌క్కి త‌గ్గాడు అన్న రూమ‌ర్ వినిపిస్తోంది. కార‌ణాలేవైనా చ‌ర‌ణ్ క‌థ చైకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం చై వెంకీ మామ‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఇటీవ‌లే శేఖ‌ర్ క‌మ్ములా చిత్రాన్ని చైత‌న్య సెట్స్ కు తీసుకెళ్లాడు. ఆ సినిమా పూర్త‌యిన త‌ర్వాత గాంధీ సినిమా ప్రారంభం అయ్యే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం యూవీ క్రియేష‌న్స్ సాహో సినిమా రిలీజ్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఆగ‌స్టు 15న రిలీజ్ చేయాల్సిన సినిమాను 30కి వాయిదా వేసారు. ఆ హ‌డావుడి క్లియ‌ర్ అయిన త‌ర్వాత చై సినిమాపై క్లారిటీగా అప్ డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.