అక్కినేని జంట “మజిలీ” ఎక్కడ..?

-

అక్కినేని నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా జూలైలో మొదలైంది. సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండగా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాత చైతు సమంత కలిసి చేస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా మజిలీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిన్నుకోరి సినిమా తర్వాత శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

చైతు సమంత కలిసి చేస్తున్నారు కాబట్టి సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. రియల్‌లైఫ్‌లో భార్యాభర్తలైన వీళ్లు ఈ సినిమా ద్వారా రీల్ లైఫ్‌లో కూడా దంపతులుగా నటించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఇదిలాఉండగా, నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు ఈ నెల చివరన రిలీజ్ అవనుంది. ఆ తర్వాత సవ్యసాచి కూడా వస్తుంది. ఈ రెండిటి తర్వాత ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తారట. మరి చైతు, సమంతల ‘మజిలీ’ ఎక్కడ.. ఎలా అన్నది ఆసక్తికరంగా ఉండబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news