సమంత గురించి జాతీయ మీడియాలో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు

-

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అప్పటినుంచి ఈ కపుల్ కు సంబంధించి ఏ వార్త రాసిన హార్ట్ టాపిక్ గానే మారుతుంది. కొందరు సమంత బిహేవియర్ కారణంగానే చైతు విడాకులు తీసుకున్నాడని ప్రచారం చేయగా.. మరికొందరు సమంతకు చైతు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదని అందుకే విడిపోయిందని ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుకోవడం చాలా అసహనం కలిగిస్తుందని పేర్కొన్నాడు. తన వ్యక్తిగత జీవితం గురించి చర్చించుకోవడం తనకి ఏమాత్రం ఇష్టపడనని తెలిపారు. ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందని.. “పర్సనల్” అని ఎందుకు అంటామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. తాను సినీ రంగంలో సాధించిన వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదని.. ఇది చాలా చికాకు కలిగించే అంశం అని అన్నాడు. ఇప్పుడు సమంత దారి సమంత దే, నా దారి నాదే.. ఇంతకుమించి ఈ విషయంలో చెప్పాల్సింది ఏమీ లేదు అని స్పష్టం చేశాడు చైతు.

Read more RELATED
Recommended to you

Latest news