ఎన్టీఆర్ బయోపిక్ పై నాగబాబు కామెంట్..!

-

పవన్ ఎవరో తనకు తెలియదు అని చెప్పిన బాలకృష్ణను ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆడేసుకుంటున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పి ఆ తర్వాత ఎవరో వళ్లూరి బాలకృష్ణ పేరు చెప్పిన నాగబాబు ఆ తర్వాత సారే జహాసే అచ్చా పాటని స్పంటంగా పాడిన ఓ వీడియోని షేర్ చేసి హడావిడి చేశాడు. నందమూరి ఫ్యాన్స్ ఎటాక్ చేస్తున్నా నాగబాబు ఈసారి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

ఇక లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ మీద నాగబాబు పెట్టిన ఓ కవిత సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇంతకీ నాగబాబు ఏం పెట్టాడు అంటే.. కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని.. చుట్టనేల మూట కట్టనేల.. నిజం కక్కలేని బయోపిక్కు లొద్దయా.. విశ్వదాభి రామా వినరా మామా.. అంటూ ఓ కామెంట్ తో పాటుగా దాని చివరన కవిత్వాలు మాకు వచ్చండోయ్ అంటూ పెట్టారు.

బయోపిక్ పై తన కామెంట్ గురించి ఇలా పెట్టాడు నాగబాబు. ఇది చూసిన ఎవరైనా సరే ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి అనే అనుకుంటున్నారు. వ్యవహారం సర్ధుమనిగే టైంలో నాగబాబు మళ్లీ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో ముదిరేలా చేస్తున్నాడు. మరి ఈసారి బయోపిక్ పై పెట్టాడు కాబట్టి అటు నుండి అదే విధమైన ఘాటు రెస్పాన్స్ వస్తుందని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news