వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఎ)కు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వూలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సాగి స్తున్న విచారణ ప్రక్రియపై నమ్మకం లేదని పేర్కొంటూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా..ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు విమానాశ్రయ లాంజ్ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి,
దర్యాప్తును జాతీయ సంస్థలకు అప్పగించవచ్చని భావిస్తూ… జస్టిస్ కొంగర విజయలక్ష్మీ, జస్టిస్ ఎస్‌వి భట్‌లతో కూడిన రెండవ బెంచ్ కోర్టు ధర్మాసనం ఎన్‌ఐఎకు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్ రాష్ట్ర ఫ్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా సిట్ బృందంతో విచారణ చేస్తోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఆలస్యం చేస్తుందన్నారు. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశా లున్నాయని వినిపించారు.