వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే… చైతు, సమంతలపై నాగ్..!

-

నాగ చైతన్య సమంత జంటగా నటించిన మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు అటెండ్ అవడం విశేషం. ఇక ఈ సినిమా వేడుకలో నాగ్ మాటలు అందరిని ఆశ్చర్యాన్ని కలిగించాయి. చైతు, సమంతల గురించి మాట్లాడుతూ ఏమాయ చేసావె సినిమాతో మంచి పెయిర్ గా అనిపించుకున్న చైతు సమంత మనం సినిమా టైంలో కూడా తనకు తెలియకుండా రొమాన్స్ చేశారని చెప్పాడు నాగార్జున.

ఇక మజిలీ సినిమా గురించి చెబుతూ వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు అంటూ శివ నిర్వాణ డైలాగ్ వినగానే కాస్త కోపం వచ్చిందని అది కూడా చైతుకి పెట్టడం పట్ల షాక్ అయ్యానని అది సినిమా కోసం కాబట్టి ఓకే కాని చైతు, సమంతలను ఉద్దేశిస్తూ మంచి అబ్బాయిలకు మంచి అమ్మాయిలు దొరుతారని అన్నాడు నాగార్జున. ఇక వేడుకకు అతిథిగా వచ్చిన వెంకటేష్ కూడా సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆశించారు. ఉగాది పండుగ మజిలి సినిమాతో ఇంకాస్త పెద్ద పండుగ కానుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news