చై – సామ్‌ల మ్యాజిక్‌ మరోసారి : ‘మజిలీ’ ట్రైలర్‌

-

నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో భాగంగా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

వెధవలకు ఎప్పుడూ మంచి భార్యలే దొరుకుతారు అంటూ శివ నిర్వాణ మజిలీ టీజర్ తోనే బాంబ్ పేల్చాడు. ఇక లేటెస్ట్ గా మజిలీ ట్రైలర్ సినిమాపై ఇంకాస్త క్యూరియాసిటీ పెంచింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో సమంతతో పాటుగా దివ్యాన్ష కౌషిక్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఉగాది రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ట్రైలర్ చూస్తే చైతు, సమంత మరోసారి ఏమాయ చేసావె మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news