దేవదాస్ టీజర్.. పచ్చి ‘రా’ తాగేస్తున్నారే..!

-

 

నాగార్జున, నాని మల్టీస్టారర్ గా వస్తున్న దేవదాస్ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ గా నటిస్తున్నారని తెలియగా ఇక ఈ టీజర్ లో ఇద్దరు కలిసి మందు కొట్టే సీన్ రివీల్ చేశారు. డాన్ దేవగా నాగార్జున మందు బాటిల్ ఓపెన్ చేసి పోస్తుంటే కనీసం సోడా కూడా కలుపుకోకుండా తాగేస్తాడు డాక్టర్ దాసు అయిన నాని.

పెగ్ ఫిక్స్ చేసి.. సోడా.. వాటర్ అని అటు తిరిగి ఇటు తిరిగే లోగా నాని పెగ్ లాగించేస్తాడు. పచ్చిగా చెప్పాలంటే రా తాగేస్తాడన్నమాట. దాసు ఏంటి సంగతి అంటూ నాగార్జున నానిని అడుగుతాడు. మరి డాక్టర్ అయిన దాసుకి ఏమంత కష్టం వచ్చిందో ఏమో కాని దేవదాస్ ల కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పొచ్చు.

నాగార్జున, నానిల క్రేజీ కాంబినేషన్ సినిమాకు మరింత ప్లస్ అవనుంది. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ అంచనాలను మించి ఉంది. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news