దేవదాస్ ట్రైలర్.. పక్కా కామెడీ బొమ్మ

-

రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు శ్రీరాం ఆదిత్య నాగార్జున, నానిలతో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. క్రేజీ మల్టీస్టారర్ నిర్మించారు అశ్వనిదత్. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుక గురువారం సాయంత్రం జరిగింది. ఇక ఈ సందర్భంగా దేవదాస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఏయన్నార్ జయంతి రోజున దేవదాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే డాక్టర్ దాసు రిస్క్ లో పడగా.. అతని పేషెంట్ అయిన డాన్ దేవా ఎలా అతని సమస్యను సాల్వ్ చేశాడు అన్నదే కథ అని తెలుస్తుంది. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం కామెడీతో కితకితలు పెట్టించింది. నాని, నాగార్జున కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.

దేవదాస్ ట్రైలర్ మీద మీరు ఓ లుక్కేయండి..

Read more RELATED
Recommended to you

Latest news