బిగ్ బాస్ హౌజ్ లో నాగార్జున సందడి

-

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ హౌజ్ లో వచ్చే వారం టైటిల్ విన్నర్ ఎవరో తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ ఆదివారం కింగ్ నాగార్జున బిగ్ బాస్ హౌజ్ కు గెస్ట్ గా వచ్చారు. నాగార్జున, నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్స్ గా నటించారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ లోకి వచ్చిన నాగార్జున హౌజ్ మెట్స్ తో సరదా సంభాషణలు చేశారు. మీకు ఏమొచ్చిందని 100 రోజులు ఆ హౌజ్ లో ఉన్నారు. తానైతే ఒక్కరోజు కూడా ఉండలేనని అన్నారు నాగార్జున. ఇక సినిమాలో నాని పాత్రని సంభోదిస్తూ దాసుని ఇబ్బంది పెట్టింది ఎవరు అంటూ సినిమా గురించి కాస్త ప్రమోట్ చేయడం జరిగింది. మొత్తానికి నాగ్ రాకతో బిగ్ బాస్ ఈ ఆదివారం ఎపిసోడ్ కలర్ ఫుల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version