నాగార్జున క‌రోనా టెస్ట్ చేయించుకున్నారా?

మెగాస్టార్ చిరంజీవి ఈ సోమ‌వారం క‌రోనా వైన‌స్ సోకిందంటూ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడు నెల‌లుగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌` షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా ఈ సోమ‌వారం పునః ప్రారంభిస్తున్నామ‌ని మేక‌ర్స్ రెండు రోజుల ముందే ప్ర‌క‌టించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

అయితే షూటింగ్‌కి ముందు క‌రోనా టెస్ట్ చేయించుకోవ‌డంతో పాజిటివ్ అని తేలింద‌ని మెగాస్టార్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. దీంతో ఒక్క‌సారిగా మెగా ఫ్యాన్స్‌తో పాటు నాగార్జున అభిమానులు కూడా ఉలిక్కిప‌డ్డారు. నాగార్జున ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని శ‌నివారం క‌లిశారు. అయితే ఈ స‌మ‌యంలో చిరుకి కానీ, నాగార్జున‌కు కానీ ఎలాంటి మాస్క్ లేదు. దీంతో చిరుకు పాజిటివ్ వ‌చ్చింది కాబ‌ట్టి నాగార్జున ప‌రిస్థితి ఏంట‌నే అంతా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో చిరు విష‌యం తెలిసిన వెంట‌నే నాగార్జున క‌రోనా టెస్ట్ చేయించుకున్నార‌ట‌. ఈ టెస్టులో నాగ్‌కి నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో నాగ్ అభిమాన‌లు ఊపిరి పీల్చుకున్న‌ట్టు తెలుస్తోంది. కింగ్ నాగార్జున అంద‌రి కంటే ముందు బిగ్‌బాస్ ప్రోమో కోసం సెట్‌లో కాలుపెట్టారు. అప్ప‌టి నుంచి బిగ్‌బాస్ కోసం వ‌ర్క్ చేస్తూనే త‌ను న‌టిస్తున్న `వైల్డ్ డాగ్‌` కోసం హిమాల‌యాల‌కు కూడా వెళ్లొచ్చారు. ప్ర‌స్తుతం నాగ్ హోమ్ ఐసోలేష‌న్‌లో వుంటున్నారు.